బతుకమ్మ చీరలు ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులు కట్టుకుంటారా...?

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించి,పూలమాలలు వేసి ఘనగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెట్టిచాకిరి విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని,ఆమె పోరాట స్పూర్తితో నేటి తరం ముందుకు పోవాలని ఆకాంక్షించారు.

 Bathukamma Sarees Are Worn By The Chief Minister And Ministers' Family Membe-TeluguStop.com

ఆమె పోరాట స్పూర్తిని ముందు తరాలకు అందించేందుకు హైదరాబాద్ లో ప్రధాన సెంటర్ అతి పెద్ద ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామంలో కమ్యూనిటీ హాల్(రజక భవనం) కోసం సొంతంగా రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు.తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల స్తూపం ఆధునీకరణ చేసి,ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ఎంతో మంది యువకుల,విద్యార్థుల త్యాగాల పునాదుల మీద, ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కలలు కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ పాలనలో గత ఎనిమిదేళ్లలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు.

తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని గుర్తు చేశారు.అందుకే ప్రభుత్వాన్ని బరాబర్ ప్రశ్నిస్తామని తెలిపారు.

ప్రశ్నించడం అనేది ప్రతిపక్షాల నైతిక బాధ్యతని,దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని,కానీ,ప్రశ్నిస్తే ఎదురు దాడి చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ విధానంగా మారిందని విమర్శించారు.రూ.90 బతుకమ్మ చీరలిచ్చి కేసీఆర్ మహిళలను కేసీఆర్ అవమానిస్తున్నడని ఆరోపించారు.రాష్ట్ర కేబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని,అందుకే ఇలాంటి వాటిపై అడిగే వారు లేరని అన్నారు.

బతుకమ్మ చీరలను దమ్ముంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రుల కుటుంబ సభ్యులు కట్టుకుంటారా ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube