ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి..మంత్రి ఆర్.కె.రోజా

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వైయస్సార్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యుటీ సీఎం అంజాద్ బాషా.మంత్రులు ఆర్.

 Ntr Health University Has All The Qualifications To Be Converted Into Ysr Health-TeluguStop.com

కె.రోజా, ఆదిమూలపు సురేష్.మొదటగా రెండు కోట్ల రూపాయలతో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకు వచ్చిన వైయస్సార్ క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభించారు.క్రీడా వికాస కేంద్రం లో ఉన్న వివిధ వసతులను పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు క్రీడాభివృద్ధి కోసం యర్రగొండపాలెం లో క్రీడా వికాస కేంద్రం మరియు ఆరు లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం చెక్కులను విడుదల చేశారు.

మంత్రి ఆర్.కె.రోజా మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి జగనన్న ఎంతగానో కృషి చేస్తున్నాడని అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, అమరావతి రాజధాని రైతులు అంటూ పాదయాత్రలో పాల్గొనేవారు అసలు రైతులే కాదు, రైతులు ఎవరైనా వాకి టాకీ లు, ఖరీదైన చీరలు కట్టుకొని వస్తారా అని వ్యాఖ్యానించారు.ఎప్పటికైనా చంద్రబాబునాయుడు నీచమైన రాజకీయం మానుకోవాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, స్పోర్ట్స్ అధికారులు, జిల్లా ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube