ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన బాబు మోహన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ప్రస్తుతం బాబు మోహన్ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.
ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రాజకీయాలు, సినిమాలు రెండూ రెండే అని రాజకీయాలు ప్రజలతో పని అని సినిమాలు ప్రతిభతో పని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
తోటి హాస్యనటులలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంలతో నాకు ఎక్కువగా అనుబంధం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.నేను నటించిన సినిమాలలో పెళ్లిసందడి సినిమా ఇష్టమని ఆయన తెలిపారు.
ఆ సినిమాలో నేను నిజంగా డోలు కొట్టానేమో అనేలా నటించానని ఆయన చెప్పుకొచ్చారు.అంకుశం అనే సినిమా లేకపోతే సినిమాల్లోకి వచ్చానని నాకు కోడి రామకృష్ణ గారు లేకపోతే నాకు సినీ లైఫ్ ఉండేది కాదని ఆయన కామెంట్లు చేశారు.
నా గురువు గారు, నాకు జన్మనిచ్చిన గురువుగారు కోడి రామకృష్ణ అని ఆయన వెల్లడించడం గమనార్హం.నేను చేసిన సాంగ్స్ లో మాయలోడు సాంగ్ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.
చిరంజీవి గారు మాయలోడు సినిమాలోని సాంగ్ ను అడిగి మరీ చూశారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.ఆ సినిమా విషయంలో నాకు చాలా ప్రశంసలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

నేను సీనియర్ ఎన్టీఆర్ అభిమానినని మా నాన్న అమ్మ కూడా ఎన్టీఆర్ అభిమానులని ఆయన చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ గారితో మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కిందని ఆయన తెలిపారు.అన్నగారు చనిపోయిన తర్వాత ఆయనపై ఉన్న అభిమానంతో ఆయన స్థాపించిన పార్టీలో చేరానని బాబు మోహన్ కామెంట్లు చేయడం గమనార్హం.బాబు మోహన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.