ఈ మధ్య ఏ సంఘటన జరిగినా నా వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేస్తున్నారు.ఎన్టీఆర్ నేను వివాహం చేసుకున్నాం.
చంద్రబాబు కి మొదటి నుంచి మా పెళ్లి ఇష్టం లేదు.మా వివాహం గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు… ఎవరైనా మాట్లాడితే కేసు వేస్తా.
ఎన్టీఆర్ దగ్గర ఏమి లేనప్పుడు నేను వచ్చాను… ఆ తరువాత అధికారం తెచ్చాను.చంద్రబాబు చేసిన దుర్మార్గపు చర్యకు కుటుంబ సభ్యులు వంతపాడారు.
చంద్రబాబు నమ్మించి గొంతు కొస్తాడు అని ఎన్టీఆర్ అన్నారు.ఎన్టీఆర్ కి ద్రోహం చేయన ని చంద్రబాబు కొడుకు లోకేష్ మీద ప్రమాణం చేశారు.
ఈ రోజు తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడే ఆయన పిల్లలు సిగ్గుపడాలి.ఎన్టీఆర్ పేరు మార్పు పై ఎన్టీఆర్ హంతకులు బాధ పడుతున్నారు.
చంద్రబాబు సీఎం గా ఉండగా ఒక్క పథకానికి అయినా ఎన్టీఆర్ పేరు పెట్టారా? ఎన్టీఆర్ పేరు మార్చాలని చంద్రబాబు ఎప్పుడో అనుకున్నారు.ఆయన కి అడిగే హక్కు ఎక్కడ ఉంది.
యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు కంటే జిల్లా కి ఎన్టీఆర్ పేరు ఉండాలని కోరుకుంటా ఎన్టీఆర్ అంటే సీఎం జగన్ కి కోపం, ద్వేషం లేదు.సీఎం ని కలిసి ఏదైనా ప్రాజెక్టు కి ఎన్టీఆర్ పేరు పెట్టమని అడుగుతా.
జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న సంస్కారం టీడీపి నేతలకు లేదు.చంద్రబాబు, లోకేష్ లు జునియర్ ఎన్టీఆర్ పై కక్ష పెట్టుకున్నారు.
లోకేషా డేరా బాబా నా?