హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేరుతో కొందరు కేటుగాళ్లు ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు.
అనంతరం సీపీ పేరుతో మెసేజ్ లు చేస్తున్నారు.దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.8764747849 నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్లను నమ్మొద్దని సూచించారు.ఇటువంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.







