సినిమా ఇండస్ట్రీలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.కొన్నిసార్లు కొంతమందిని చూస్తే హీరోగా కన్నా విలన్ గా పర్ఫెక్ట్ గా సరిపోయారనే భావన కలుగుతుంది.
ఇలా విలన్ గా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో నటుడు సుబ్బరాజు ఒకరు.ఈయన హీరో కటౌట్ అయినప్పటికీ విలన్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.
అయితే ఈయన హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి విలన్ గా సెటిల్ అయ్యానని ఎన్నో సందర్భాలలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుబ్బరాజు సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను హీరోగా నటించాలని ఇండస్ట్రీకి వచ్చాను.అయితే తనకు హీరోగా నటించే అవకాశాలు రాలేదు.ఒకవేళ తాను హీరోగా నటించే అవకాశం వస్తే నాకు విలన్ గా హీరో అల్లు అర్జున్ నటించాలని ఉంది అంటూ ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇక అల్లు అర్జున్ తనకు విలన్ గా ఎందుకు నటించాలనుకుంటున్నాను అనే విషయానికి వస్తే తాను ఎక్కువగా అల్లు అర్జున్ తో కలిసి సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు.నన్ను ఎక్కువగా గాల్లో కొట్టింది బన్నినే అందుకే నా సినిమాలో ఆయన నాకు విలన్ గా నటించాలని ఉందని సుబ్బరాజు వెల్లడించారు.బన్నీతో తనకి ఎంతో మంచి స్నేహం ఉందని, ముఖ్యంగా మేమిద్దరం కలిసి నటించిన ఆర్య సినిమాలో నా నటన ఎంతో క్రూరంగా ఉందని ఇప్పుడు కనుక ఆ సినిమాను చూస్తే చాలా నవ్వుకుంటానని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.