టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన అర్జున్ ఇతర భాషల్లోని సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ పోషించిన సీఎం పాత్రను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరనే సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో అర్జున్ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.
అర్జున్ కు విలన్ గా వరుస ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లు అర్జున్ కెరీర్ కు ప్లస్ కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ నటించిన పాత్రను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.నాకు సినిమాల్లోకి రావాలని మొదట లేదని నేను పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
నా పిల్లలు నా పాత సినిమాలను చూసి ఎగతాళి చేస్తారని అర్జున్ కామెంట్లు చేశారు.
బాగా సెటిల్ అయిపోయామని అనుకుంటే లైఫ్ లో ఏం చేయలేమని ఆయన తెలిపారు.
శ్రీ ఆంజనేయం సినిమాలో హనుమంతుని పాత్ర పోషించడంతో ఎవరైనా నన్ను చూస్తే దండం పెట్టేవారని అర్జున్ తెలిపారు.ఒకే ఒక్కడు మూవీ చూసి చాలామంది నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని సూచించారని అర్జున్ అన్నారు.
అలాంటి లీడర్ ఉంటే బాగుంటుందని ప్రజలు భావించారని అర్జున్ అన్నారు.

మొదట ఒకే ఒక్కడు సినిమాలో నటించడానికి సంకోచించానని ఆయన చెప్పుకొచ్చారు.నాకు డైరెక్షన్ ఇష్టం అని ఆయన పేర్కొన్నారు.గాసిప్స్ వల్ల యాక్టర్ల కుటుంబ సభ్యులు బాధ పడతారని అర్జున్ అన్నారు.
ఒక్కరోజు సీఎంగా అయ్యే అవకాశం వస్తే ఆరోగ్యం, విద్య ఫ్రీ చేస్తానని ఆయన తెలిపారు.ఛాన్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని అర్జున్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.