విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో గత కొన్ని రోజులుగా పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.తాజాగా వేమలి గ్రామం సమీపంలో పశువుల మందపై దాడికి పాల్పడింది.
అనంతరం ఆవును చంపి గ్రామంలో ఉన్న తోటలో పాగా వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







