మన భారతదేశంలో రూపొందించే పాటలు ఇప్పుడు విదేశాల్లో కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.తెలుగు సినిమా పాటలు కూడా ప్రపంచంలోని కోట్లాది మందిని ఉర్రూతలూగిస్తున్నాయి.
ఇక బాలీవుడ్ సాంగ్స్ ముస్లిం దేశాల్లో ఎప్పుడూ సూపర్ ఫేమస్ ఔతాయి.కాగా తాజాగా నేహా కక్కర్ పాడిన ఒక రొమాంటిక్ సాంగ్ మన దేశంతో పాటు పక్క దేశాల్లో కూడా బాగా వైరల్ అవుతోంది.‘బారిష్ మై తుమ్’ అంటూ సాగే ఈ పాట విడుదలై రెండు వారాలు అవుతోంది.ఇది ఇప్పటికే చాలా మూడు కోట్ల రెండు లక్షల వ్యూస్ సంపాదించింది.
దీనికి చాలామంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారు.
అయితే తాజాగా పాకిస్థాన్‌కు చెందిన భార్యాభర్తలిద్దరూ ఈ పాటకి చక్కటి హావభావాలు వ్యక్తపరుస్తూ అందర్నీ కట్టిపడేసారు.
ఈ జంటకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే.
మనకు ఒక మగ వ్యక్తి చపాతీలు చేస్తూ ‘బారిష్ మై తుమ్’ పాటకు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ కనిపిస్తాడు.ఇంతలోనే అతడి భార్య ఎంట్రీ ఇస్తుంది.
ఆమె తన భర్త భుజాలపై చేతులు పెనవేసి హీరోయిన్ వలె క్యూట్, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది.ఎంత పేదరికంలో వున్నా వారు సంతోషంగా పాటలు పాడుకుంటూ పనులు చేయడాన్ని చూసి నెటిజన్లు.“ఆహా ఆనందం అంటే ఇదే” అని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియో టిక్‌టాక్‌లో మొదటగా షేర్ కాగా చాలా వ్యూస్ వచ్చాయి.
అనంతరం అది చాలా సోషల్ మీడియా సైట్లలో కూడా వైరల్ అయ్యింది.చివరికి ఈ పాట పాడిన నేహా కక్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కూడా దీనిని షేర్ చేసింది.
ఆ వీడియోకి మిలియన్ల కొద్ది వ్యూస్, 5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మీరు కూడా దీనిపై ఒక లుక్కేయండి.







