డెత్ సర్టిఫికెట్ కోసం బ్రతికి ఉన్న మనిషి వెతుకులాట.. ఇదేం విచిత్రం అంటున్న ప్రజలు

వార్తాపత్రికలలో మనకు కావాల్సిన ఎన్నో ప్రకటనలు ఉంటాయి.దీంతో క్లాసిఫైడ్స్‌ను చూసి, మనకు కావాల్సిన పనిని మనం పూర్తి చేసుకుంటాం.

 A Living Man Is Looking For A Death Certificate Death Certificate, Viral Latest,-TeluguStop.com

ఒక్కోసారి మనం ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్ పోగొట్టుకున్నట్లయితే వాటి కోసం పత్రికలలో అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వొచ్చు.తద్వారా పోయిన వాటిని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్కోసారి విచిత్రమైన ప్రకటనలను పత్రికలు ప్రచురిస్తాయి.ఇలాంటివి మనం ఇప్పటి వరకు చాలా చూసి ఉంటాం.

మ్యాట్రిమోనియల్ ప్రకటనల నుండి బహిరంగ క్షమాపణల వరకు, ఎన్నో ప్రకటనలను చూశాము.వీటన్నింటినీ మించి ఓ విచిత్రమైన వార్తాపత్రిక ప్రకటన ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

అది చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.అసలు ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారు.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల రంజిత్ కుమార్ చక్రవర్తి అనే వ్యక్తి పేరుతో ఓ వార్తాపత్రికలో ప్రకటన వచ్చింది.

తాను డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నానని, దొరికిన వారు తెచ్చివ్వాలని అందులో ఉంది.దీనిని కొందరు వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టడంతో వెలుగులోకి వచ్చింది.

డెత్ సర్టిఫికెట్ కోసం వెతకడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.చనిపోయిన తర్వాత తిరిగి దెయ్యమై వచ్చాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సర్టిఫికేట్ కనపడితే ఎక్కడికి తెచ్చివ్వాలి.స్వర్గానికా నరకానికా అంటూ ప్రశ్నిస్తున్నారు.

నెటిజన్లు ఆ వ్యక్తిని ‘లెజెండ్‘ అని పిలిచి నవ్వుతున్నారు.అయితే కొందరు ఇలాంటి విచిత్రమైన ప్రకటనను ముద్రించినందుకు ప్రచురణపై విమర్శలు చేశారు.

అయితే ఇది పొరపాటుగా ముద్రించి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా అచ్చుతప్పులు మరీ ఇంతలా ఉంటాయని కొందరు విమర్శిస్తున్నారు.

ముద్రించే ముందు చెక్ చేసుకుని ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube