దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్యత కోసం ఆర్జేడీ, జేడీయూ నేతలు సిద్ధమయ్యారు.దీనిలో భాగంగా 2024లో బీజేపీని గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే నేడు ఢిల్లీ, హర్యానాలో జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు పర్యటించనున్నారు.ఓం ప్రకాష్ చౌతాల తండ్రి మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి వేడుకల్లో ఇరువురు పాల్గొననున్నారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు సమావేశం అవుతారని సమాచారం.







