టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన వి.వి.
వినాయక్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.లైగర్ సినిమా ఫ్లాప్ గురించి, పూరీ జగన్నాథ్ గురించి వినాయక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
పూరీ జగన్నాథ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని వినాయక్ అన్నారు.పూరీ జగన్నాథ్ పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారని వినాయక్ తెలిపారు.
పూరీకి క్లోజ్ గా ఉండేవాళ్లకు మాత్రమే ఆయన యొక్క సామర్థ్యం ఏంటో తెలుసని వినాయక్ చెప్పుకొచ్చారు.పూరీ జగన్నాథ్ కు సామర్థ్యం ఉందని లైగర్ సినిమా ఫ్లాప్ కావడం వల్ల ఆయన జీవితం మారదని వినాయక్ చెప్పుకొచ్చారు.
సినిమా అన్న తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు సహజంగా ఉంటాయని వినాయక్ కామెంట్లు చేశారు.పూరీ జగన్నాథ్ ముందునుంచి లైగర్ సినిమా విషయంలో సిద్ధంగా ఉన్నాడని వినాయక్ కామెంట్లు చేశారు.
లైగర్ సినిమా విషయంలో ఎంత వచ్చిందో ఎంత పోయిందో పూరీ జగన్నాథ్ కు తెలుసని వినాయక్ చెప్పుకొచ్చారు.

పూరీ జగన్నాథ్ ఫ్లాప్ గురించి ఎక్కువగా ఆలోచించడని వినాయక్ కామెంట్లు చేశారు.సినిమా రంగంలో దాసరి నారాయణరావు చూసిన స్తాయిలో మరెవరూ కష్టాలు పడి ఉండరని వినాయక్ చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం అని వినాయక్ కామెంట్లు చేశారు.

దర్శకుడు వినాయక్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.వినాయక్ ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ పనులతో బిజీగా ఉన్నారు.హిందీ ఛత్రపతితో వినాయక్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఛత్రపతి సక్సెస్ సాధిస్తే వినాయక్ తో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.







