సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు.ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం పట్టివేతపై ప్రభుత్వ వ్యతిరేక పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు అధికారులు.
ఈ క్రమంలో అంకబాబును రిమాండ్ కు తరలించాలన్న సీఐడీ వాదనలను కోర్టు ఖండించింది.ఆయనకు సీఆర్పీపీసీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
దీనిపై నోటీసులు ఇస్తే అంకబాబు తీసుకోలేదని సీఐడీ తెలపగా.తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అంకబాబు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ధర్మాసనం సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించింది.అనంతరం 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి వదిలేయాలని ఆదేశించింది.







