ఆ ముగ్గురు హీరోయిన్స్ అందాలే ఇంధనం.. మణి రత్నం మార్కు మూవీ

ఇండస్ట్రీ కి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.మహా అయితే ఎంతో ట్యాలెంట్ ఉన్న కూడా పది ఏళ్ళు, పదిహేను ఏళ్ళు అందాన్ని కాపాడుకొని ఇండస్ట్రీలో కాపాడుకుంటారు.

 Manirthnam Mark Movie Ponniyan Selvan Trisha Aishwarya Rai Aishwarya Lekshmi Det-TeluguStop.com

కానీ ఏళ్ళు గడిచిన తరగని అందం, క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఎంత మంది ఉంటారు.వేళ్ళ మీద లెక్కపెట్టుకునేంత మాత్రమే.

అందం కాపాడుకొని, సినిమాలు నిలబెట్టుకొని మెరిట్ లో ఉంటూ వస్తున్న హీరోయిన్స్ లలో ముందు వరసలో వచ్చే వారు ఐశ్వర్య రాయ్, త్రిష. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్.

ఈ సినిమాలో వీరితో పాటు మరొక హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఉంది.విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురి వయసు విషయానికి వస్తే ఐశ్వర్య కి 48 , త్రిష కి 40, ఐశ్వర్య లక్ష్మి ౩౨.ముగ్గురికి ఒక్కొక్కరికి 8 ఏళ్ళ గాప్ ఉంది.

ఐశ్వర్య రాయ్

Telugu Aishwarya Rai, Mani Ratnam, Trisha, Jayam, Karthi, Ponniyin Selvan, Ps, V

30 ఏళ్ళ క్రితం మోడలింగ్ లోకి ప్రవేశించి, హీరోయిన్ గా మారి, 15 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకొని, 10 ఏళ్ళ పాపకు తల్లిగా ఉంది.అయినా ఐశ్వర్య అంటే అందరికి అందాల దేవత.మణి రత్నం లాంటి దర్శకుడు ఇందుకు మినహాయింపు కాదు.ఈ వయసులోనూ ఐశ్వర్య ఆయనకు మెయిన్ లీడ్.48 ఏళ్ళ వయసులో వన్నె తరగని అందం తో పొన్నియన్ సెల్వన్ సినిమాలో రెండు పాత్రలు పోషిస్తుంది.

త్రిష

Telugu Aishwarya Rai, Mani Ratnam, Trisha, Jayam, Karthi, Ponniyin Selvan, Ps, V

ఈమె కూడా దాదాపు ఐశ్వర్య పోలికలతోనే ఉంటుంది.అటు ఇటుగా కెరీర్ సాగిన తీరు కూడా ఒకే రకంగా ఉంటుంది.20 ఏళ్ళ క్రితం మోడలింగ్ రంగం లో అడుగు పెట్టి 15 ఏళ్ళ క్రితం సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది.పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ గానే ఉన్న త్రిష మణి రత్నం సినిమా కి మెయిన్ లీడ్.

కుందవి అనే పాత్రలో నటిస్తుంది.కత్తి పట్టకుండా, సింహాసనం పై కూర్చోకుండా, చోళ రాజ్యాన్ని విస్తరించిన కుందవి పాత్రకు త్రిష ఈమేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి.

ఐశ్వర్య లక్ష్మి

Telugu Aishwarya Rai, Mani Ratnam, Trisha, Jayam, Karthi, Ponniyin Selvan, Ps, V

త్రిష, ఐశ్వర్యాలు పాత్రలకు ఏమాత్రం తీసిపోదు ఐశ్వర్య లక్ష్మి పాత్ర.సముద్ర పుత్రిక పుంగారిళి పాత్ర లో నటించింది.ఈమె పై ఇప్పటికే ఒక పాట రావడం తో ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యత కూడా పెరిగింది అని చెప్పుకోవచ్చు.

వీరే కాకుండా ఈ సినిమాలో విక్రమ్, కార్తీ వంటి పెద్ద హీరోలు నటిస్తున్న నేపథ్యంలో ఎవరి పాత్ర తక్కువ నిడివి లేకుండా ఎవరి ఇగోలు హార్ట్ అవ్వకుండా మణి రత్నం జాగ్రత్త పడే ఉంటాడు.

ఇంత పెద్ద ప్రాజెక్ట్ బయటకు వస్తున్న క్రమం లో ప్రతి ఒక్కరు ఈ సినిమాలో బాగా లేని బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటున్నారు.అది సరిగ్గా వర్క్ అవుట్ కాకపోతే సినిమాలో ఆ ఎస్సెన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది అలాగే నాసిరకమైన సంగీతం సినిమాకు మైనస్ గా మారబోతుంది.

మరి విడుదల అయ్యాక సినిమా ఎలాంటి రూపు దిద్దుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube