కేరళలో పీఎఫ్ఐ కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు.కొచ్చితో పాటు పలు ప్రాంతాల్లో షాపులపై, బస్సులపై పీఎఫ్ఐ మద్ధతుదారులు రాళ్లు రువ్వారు.
పీఎఫ్ఐ ఛైర్మన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.అంతేకాకుండా కన్నూరు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబ్ తో దాడి చేశారు.
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో.ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అనంతరం పీఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







