టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.తమన్నాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లో కూడా తమన్నాకు పాపులారిటీ పెరిగింది.ఇప్పటికీ సౌత్ ఇండియాలో తమన్నా టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.
అయితే తమన్నా హిందీ సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
తమన్నా బబ్లీ బౌన్సర్ అనే సినిమాలో నటించగా ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తమన్నా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఫ్యాన్సీ డిన్నర్ డేట్ గురించి తమన్నా మాట్లాడుతూ నేను ఫ్యాన్సీ డిన్నర్ డేట్స్ చేయలేనని తెలిపారు.

ఫ్యాన్సీ డిన్నర్ డేట్స్ చేయడం అనేది నాకు చాల ఇబ్బందికరంగా అనిపిస్తుందని తమన్నా కామెంట్లు చేశారు.అలాంటి ప్లేస్ లో ఉండాలని అనుకున్నా నాకు కష్టంగా అనిపిస్తుందని తమన్నా తెలిపారు.నాకు ఎల్లప్పుడూ చేతులతో తినడం అంటే ఇష్టమని తమన్నా చెప్పుకొచ్చారు.ఆహారం తినడానికి కత్తి, ఫోర్క్ పట్టుకోవాల్సి వస్తే ఇబ్బందిగా ఫీలవుతానని తమన్నా అన్నారు.ఆ విధంగా చేయడం నాపై ఒత్తిడిని పెంచుతుందని తమన్నా చెప్పుకొచ్చారు.మరోవైపు బబ్లీ బౌన్సర్ సినిమాతో తమన్నా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
సినిమాసినిమాకు తమన్నాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.తమన్నా ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.
తమన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.








