ఎక్కడైనా భూమి మీద ఏర్పడే సుడి గాలులు చాలా మంది చూసి ఉంటారు.అయితే సముద్రంలో ఏర్పడే సుడి గుండాలను చూడాలంటే మామూలు విషయం కాదు.
అందులోనూ ఒకేసారి నాలుగు సుడి గుండాలు చాలా అరుదుగా ఏర్పడతాయి.ఇలాంటి అద్భుతమైన కనువిందు చేసే దృశ్యం.
నాలుగు ఆకట్టుకునే వాటర్‌స్పౌట్‌లు లేదా సముద్రపు ఉపరితలంపై ఏర్పడే సముద్రపు సుడిగాలిని చూపించే వీడియో ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతోంది.స్పానిష్ ద్వీపం మల్లోర్కా నుండి ఒక పడవ నుండి ఈ అద్భుతమైన ఫుటేజీని సెల్‌ఫోన్‌లో బంధించారు.
దీనిని @cualify అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా విపరీతమైన స్పందన వస్తోంది.ఇప్పటికే 7,15,000 వ్యూస్ దక్కాయి.

ఇటీవల కొందరు స్పానిష్ ద్వీపం మల్లోర్కాలో సందర్శనకు వెళ్లారు.సమీపంలోని వివిధ ప్రాంతాలను తుఫానులు తాకడంతో నాలుగు వాటర్‌స్పౌట్‌లు సృష్టించబడ్డాయి.వాటర్‌స్పౌట్‌లు సాపేక్షంగా అసాధారణంగా ఏర్పడతాయి.ఈ నాలుగు సుడిగుండాలను కలిసి చూడడం చాలా అరుదైన సంఘటన. వాటర్‌స్‌పౌట్ అనేది సుడిగాలి లాంటిది.ఇది సాధారణంగా సముద్ర ఉపరితలంపై ఏర్పడుతుంది.
ఇది నీటిపై నాన్-సూపర్ సెల్ టోర్నాడోగా ఏర్పడుతుంది.ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో వాటర్‌స్పౌట్‌లు ఎక్కువగా ఏర్పడతాయి.
కానీ యూరప్, మిడిల్-ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు అంటార్కిటికాతో సహా ప్రాంతాలు కూడా అరుదైన సందర్భాలలో ఇవి కనిపిస్తాయి.ఇక స్పానిష్ సమీపంలో ఏర్పడిన ఈ సుడిగుండాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి.
సముద్ర ఉపరితలం నుంచి ఆకాశం వరకు కమ్ముకుని, కనువిందైన దృశ్యాన్ని అందించాయి.దీనిపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
తాము ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు.








