తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే మూడో వారం ముగింపు దశకు చేరుకుంది.కాగా మూడవ వారం కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ కొట్లాటలు గొడవలు, ఏడుపులతో రసవత్తతంగా సాగుతోంది.
అడవిలో ఆట అనే టాస్కు ను పోలీసులు దొంగలు,అత్యాశ గల వ్యాపారి అంటూ మూడు విభాగాలుగా విడిపోయి టాస్క్ ని ఆడుతున్నారు.ఈ ఆటలో అత్యాశ గల వ్యాపారిగా గలాటా గీతూ నిబంధనలు అతిక్రమించి ఆడుతోంది.
పోలీసులే తమ బాధ్యతలు మరచి కాపాడాల్సిన వస్తువులను దొంగతనం చేస్తూ కనిపించారు.
అప్పుడు గీతు కూడా మొండిగా ఆడడంతో వెంటనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరికీ మరొకసారి ఆ టాస్క్ రూల్స్ వివరించాడు.
పోలీస్ కేటగిరీలో ఉన్న ఇనాయను దొంగలు పట్టేసుకున్నారు.పోలీసులు స్టోర్ రూంను రైడ్ చేస్తామని చెప్పలేదు.అయినప్పటికీ ఇనయ లోపలకు వెళ్లడంతో ఆమెని పట్టుకున్నారు.దాంతో దొంగలు ఆమెను పట్టుకున్నారు.
అయితే పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో తోపులాట జరిగగా అప్పుడు ఆమెను ఇద్దరి కంటే ఎక్కువ మందే పట్టుకోగా వారి నుంచి తప్పించుకునే క్రమంలోనో లేకపోతే కావాలనే చేసిందో తెలియదు కానీ ఆరోహిని కాలితో తన్నేసింది.
నేహాను ఇనాయ చెంప మీద కొట్టింది.దాంతో నేహా బాధపడుతూ అంతలా కొట్టాలా? గొడవ మొదలు పెట్టింది.ఇనయా కూడా ఏమీ తగ్గలేదు.
తన డ్రెస్ ఎవరో పైకి లాగారంటూ, తీసేశారంటూ చెప్పుకొచ్చింది.మధ్యలో ఇన్వాల్వ్ అయిన గీతూ ఇవన్నీ తప్పు మాటలు.
అలా ఏం జరగలేదు.మాటలు మారుస్తున్నావ్ అబద్ధాలు చెప్తున్నావ్ అంటూ మండిపడింది గీతూ.
అలా మధ్య పెద్ద రణరంగమే జరిగగా అప్పుడు గీతూ పక్కకు వెళ్లి పోయి తన ఆట ఆడే ప్రయత్నం చేస్తూ తన బొమ్మలను కాపాడుకుకోవడం సూర్య, శ్రీహాన్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది.