500 కోట్ల రూపాయల బడ్జెట్ తో వినాయక్ సినిమా.. ఏం జరిగిందంటే?

గత కొన్నేళ్లుగా వీవీ వినాయక్ కెరీర్ ఆశించిన విధంగా లేదనే సంగతి తెలిసిందే.మాస్ డైరెక్టర్ అయిన వి.

 Vv Vinayak Future Project Budget Details Here Goes Viral , Chatrapati Remake, Hi-TeluguStop.com

వి.వినాయక్ గత కొన్నేళ్లలో దర్శకత్వం వహించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.ప్రస్తుతం వి.వి.వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి రీమేక్ ను తెరకెక్కిస్తున్నారు.హిందీలో ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది.

ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజైన తర్వాత 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో వినాయక్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఛత్రపతిని నిర్మిస్తున్న పెన్ స్టూడియోస్ సంస్థ వినాయక్ తో మరో సినిమా నిర్మించడానికి సిద్ధంగా ఉందని బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చారు. ఛత్రపతి హిందీ వెర్షన్ ను చూసిన నిర్మాతలు చాలా ఇంప్రెస్ అయ్యారని ఆయన కామెంట్లు చేశారు.

వాళ్లు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో వినాయక్ తో మరో సినిమా తీస్తామని ముందుకొచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Chatrapati, Budget, Vv Vinayak, Vvvinayak-Movie

ఇప్పటికే ఇందుకు సంబంధించి కథా చర్చలు జరిగాయని ఆయన కామెంట్లు చేశారు.ఛత్రపతి సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైందని హీరోయిన్ల డేట్లకు సంబంధించి ఇబ్బందులు ఎదురు కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని బెల్లంకొండ సురేష్ అన్నారు.బెల్లంకొండ సురేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడిగా వినాయక్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని 80 రోజులలో ఈ సినిమాను వినాయక్ పూర్తి చేశారని సమాచారం.

ఛత్రపతి సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.రాజమౌళి స్థాయిలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు న్యాయం చేస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube