జగన్ నిర్ణయంతో ఇర‌కాటంలో ల‌క్ష్మీపార్వతి!.. ఆమె నెక్ట్స్ అదేనా?

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీలో తీవ్ర ప్రకంపనలను రేపుతుంది.అయితే ఈ విషయం లక్షీ పార్వతి ఎలా స్పందిస్తో అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

 Nandamuri Laxmi Parvathi Reaction On Ntr Health University Name Change Details,-TeluguStop.com

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుండి పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళిన తర్వాత లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తునే వస్తున్నారు.ఎన్టీఆర్ మరణం తర్వాత ఆమె ఆయన పేరుతో ఓ పార్టీ స్థాపించనప్పటికీ అదిపెద్ద విజయం సాధించలేకపోవడంతో దాన్ని ముసివేశారు.

ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.వైఎస్సార్‌సీపీతో అనుబంధం కారణంగా ఆమెను ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్‌గా చేశారు.

ఇక లక్ష్మీ పార్వతి సమయంలో దొరికినప్పుడల్లా జగన్ పొగుడుతూ వచ్చారు.స్వర్గీయ ఎన్టీఆర్‌కి జటనే నిజమైన వారసుడన్నారు.అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు లక్ష్మీపార్వతిని ఇరుకున పెట్టాడు.ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తాలు, ఎన్జీఆర్ అభిమానుల నుండి తీవ్ర వ్వతిరేకత వస్తోంది.లక్ష్మీపార్వతి జగన్ ఎత్తుగడను సమర్థించలేని, వ్యతిరేకించలేని స్థితిలో ఉన్నారు.

ఆమె ఈ చర్యకు మద్దతిస్తే, యూనివర్శిటీ చేయాలనే ఆలోచనను ప్రారంభించిన తన భర్త పేరును తొలగించే నిర్ణయానికి ఆమె ఎలా మద్దతు ఇస్తుందని టీడీపీ మద్దతుదారుల నుండి ఆరోపలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Telugu Chandrababu, Lakshmiparvathi, Latest, Ntr, Telugu Academy, Ysjagan, Ysrcp

జగన్ తీసుకున్న మౌనంగా ఉండడమే మంచిదని లక్ష్మీ పార్వతి భావిస్తుంది.ఈ చర్యకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చీఫ్ పదవి వదుకోవాల్సి వస్తుందను భావనలో ఆమె ఉన్నారు.

ఒక్కవేళ ఈ విషయంపై జగన్ మోహన్ రెడ్డిని విమర్శించకుండా ఎలా స్పందించాలనే దానిపై ఆమె కసరత్తు చేస్తున్నారు.ఇప్పుడే హడావుడిగా కాకుండా కొద్ది రోజుల తర్వాత మీడియా ముందు వచ్చి ఎన్టీఆర్‌పై జగన్‌కు ప్రేమ ఉన్నట్లుగా చెప్పడం.

అందుకే కృష్ట జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube