కేంద్ర ట్రాన్స్‌పోర్ట్,హైవే శాఖామంత్రి నితిన్ గడ్కరీ పర్యటనకు పూల కడియం సిద్దమైంది.ఈరోజు మద్యాహ్నం రెండు గంటలకు రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్ లో కడియం-బుర్రిలంక రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీపేడ్ కు రానున్నారు.
అక్కడ నుంచి కారులో దోసాలమ్మ కాలనీ రోడ్డు ద్వారా శ్రీ సత్యదేవ నర్సరీకి చేరుకుంటారు.అక్కడ నర్సరీని తిలకిస్తారు.
అనంతరం నర్సరీ రైతుల సమావేశంలో పాల్గొంటారు.కేంద్ర మంత్రికి సత్యదేవ నర్సరీలో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసారు.
పువ్వులతో గడ్కరీ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.







