ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.పెద్దపల్లిలో రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేస్తున్న కూలీలను రైలు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృత్యువాత పడ్డారు.పెద్దపల్లి నుంచి కాజీపేట వైపు డౌన్ లైన్ లో గూడ్స్ రైలు వెళ్తుండగా.
మధ్య లైన్ లో పనులు చేస్తున్నారు.అదే సమయంలో ట్రాక్ పై వస్తున్న మరో రైలును గుర్తించకపోవడంతో కూలీలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.







