కొందరి జుట్టు చాలా ఒత్తుగా నిగనిగలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.కానీ కొందరి జుట్టు మాత్రం పల్చగా ఉంటుంది.
పల్చటి జుట్టు వల్ల ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి వీలుపడదు.పైగా పల్చటి జుట్టు చూపరులకు అంత ఆకర్షణీయంగా కూడా కనిపించదు.
ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకోవడం కోసం నానా ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.ఖరీదైన షాంపూలు, నూనెలు, సీరమ్స్ వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై పల్చటి జుట్టుతో వర్రీ వద్దు.
కేవలం ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలతోనే మీ పల్చటి జుట్టును ఒత్తుగా మరియు పొడవుగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టును ఒత్తుగా మార్చే ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఏ విధంగా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక పల్చటి వస్త్రంలో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల పెరుగును వేసి అందులో ఉండే వాటర్ ను తొలగించి పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న కలోంజి సీడ్స్ పౌడర్ వేసి కలపాలి.ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో పది నిమిషాల పాటు ఉంచాలి.
ఆపై కలోంజి సీడ్స్ ఆయిల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు మరో గిన్నెను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నీరు తొలగించిన పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల కలోంజి సీడ్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి జుట్టు మొత్తానికి పట్టించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు కనుక చేస్తే ఎంత పల్చటి జుట్టు అయినా ఒత్తుగా మరియు పొడుగ్గా మారుతుంది.