నేటి రోజుల్లో సినిమా తీయడానికి చాల రోజుల సమయం తీసుకుంటున్నారు.దాంతో హీరోల కెరీర్ మొత్తం మీద 50 సినిమాలు తీస్తే ఎంతో గొప్ప విషయం.
కానీ నిన్న, మొన్నటి పరిస్థితి వేరు.ఏడాదిలో నాలుగు, ఐదు లేదా అంత కన్నా ఎక్కువ సినిమాలు ఒక హీరో వి రిలీజ్ అయ్యేవి.
దాంతో తక్కువ టైం లో ఎక్కువ చిత్రాలు వచ్చేవి అంతే కాదు ఒకే హీరోయిన్ తో ఎక్కువ సినిమాల్లో నటించేవారు.ఆలా ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ కూడా ఉండేవి.
పలానా హీరో, హీరోయిన్ సినిమా వస్తుంది అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉండేది.ఆలా బాలకృష్ణ కెరీర్ లో సైతం ఒకే హీరోయిన్ తో ఎక్కువ సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయ్.ఆలా అభిమానులు మెచ్చిన బాలయ్య బాబు క్రేజీ కంబినేషన్స్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విజయ శాంతి

బాలకృష్ణ తొలినాళ్లలో ఎక్కువగా విజయశాంతి, రాధా, భాను ప్రియా వంటి హీరోయిన్స్ తో ఎక్కువగా నటించేవారు.అందులో బాలకృష్ణ – విజయశాంతి ల చేత ఎక్కువ సినిమా లు చేయించేవారు అప్పటి దర్శకనిర్మాతలు.అందుకే దాదాపు 1990 వ దశకం వరకు ఎక్కువ గా విజయ శాంతి తో సినిమాలు నటించారు బాలయ్య.90 వ దశకం దాటినా తర్వాత లారీ డ్రైవర్, నిప్పు రవ్వ వంటి సినిమాల్లో నటించారు వీరిద్దరు.వీరి కాంబినేషన్లో వచ్చిన అనేక సీనియాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.అంతే కాదు వీరిద్దరి జంట బాగా సెట్ అవ్వడం తో వీరు పెళ్లి చేసుకుంటారు అనే వాదన సైతం ఎక్కువ గా వినిపించేది.
రోజా

ఇక 1990 ముందు వరకు విజయ శాంతి తో ఎక్కువ సినిమాల్లో నటించిన బాలయ్య ఆ తరువాత రోజా తో సైతం ఎక్కువగా కలిసి నటించారు.రోజాను సైతం బాలయ్య లక్కీ పెయిర్ అంటూ ఉంటారు అయన ఫ్యాన్స్.వీరిద్దరి కాంబినేషన్ లో మంచి మాస్ సినిమాలు వచ్చి క్రేజీ జంటగా మారారు.
తొలుత బాలయ్య రోజాతో భైరవ ద్వీపం చిత్రంలో కలిసి నటించాగా ఇది మంచి విజయం సాధించింది.ఆ తర్వార్థ బొబ్బొలి సింహం వంటి హిట్ సినిమాలో కలిసి నటించారు.ఆ తర్వాత సుల్తాన్ , పెద్దన్నయ్య, శ్రీకృష్ణార్జున విజయం వంటి సినిమాల్లోనూ వీరు కలిసి నటించారు.
సిమ్రాన్

రోజా సినిమాలు మెల్లిగా తగ్గిపోతున్న క్రమంలో బాలకృష్ణ కొన్నాళ్లపాటు సూపర్ జోడిగా ఉంది సిమ్రాన్.వీరి కంబినేషన్లో సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు, ఒక్క మొగాడు, గొప్పింటి అల్లుడు, సీమ సింహం వంటి సినిమాలు వచ్చాయి.2000 ల దశకం లో వీరి క్రేజ్ మాములుగా ఉండేది కాదు.ఇక సిమ్రాన్ తర్వాత శ్రీయ వంటి హీరోయిన్ తో ఎక్కువ సినిమాల్లో నటించారు బాలయ్య.








