ఈ మధ్య కాలంలో అనసూయ సోషల్ మీడియాలో చేసిన హంగామా వల్ల ఆంటీ అనే పదం గురించి జోరుగా చర్చ జరిగింది.అనసూయ ఆలోచనల ప్రకారం ఆమె అలా చెప్పడంలో తప్పు లేకపోయినా కొంతమంది మాత్రం ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు.
సోషల్ మీడియాలో అనసూయ ఏం పోస్ట్ చేసినా ఆంటీ అంటూ కామెంట్లు చేస్తూ కొంతమంది అనసూయ హర్ట్ అయ్యేలా చేస్తున్నారు.అయితే ప్రస్తుతం అనసూయ సైలెంట్ గానే ఉన్నారు.
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ వయస్సు ఎక్కువైనా లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిలానే కనిపిస్తున్నారు.తాజాగా కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో సుమ బ్రహ్మాజీతో మీ మనోభావాలేమైనా దెబ్బ తిన్నాయా అని అడగగా ఎందుకు అని బ్రహ్మాజీ అడుగుతాడు.
ఆలస్యంగా పిలిచా కదా అని సుమ చెప్పగా బ్రహ్మాజీ కొంచెం ఆకలేస్తుందని షూటింగ్ నుంచి వచ్చామని మళ్లీ మార్నింగ్ షూటింగ్ ఉందని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత సుమ మీ ఆస్తి వివరాలు చెప్పండి అని అడగగా బ్రహ్మాజీ మాట్లాడుతూ రాజీవ్ కనకాల కంటే ఎక్కువేనని అన్నారు.మీ వయస్సు ఎంత అని సుమ అడగగా యూ నాటీ ఏ ఆంటీ అంటూ బ్రహ్మాజీ కామెంట్ చేయడం గమనార్హం.బ్రహ్మాజీ ఆంటీ అని పిలవడంతో సుమ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లు మారిపోయాయి.
ఆ తర్వాత సుమ నో కామెంట్ అని చెప్పడంతో పాటు రేపు షూటింగ్ ఎవరితోనో చూసుకోండి అని అన్నారు.బ్రహ్మాజీ ఈ మధ్య కాలంలో అనసూయను పరోక్షంగా లాగుతూ సెటైర్లు వేయడం గమనార్హం.
బ్రహ్మాజీ కామెంట్ల గురించి అనసూయ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.బ్రహ్మాజీ కామెంట్ల గురించి అనసూయ స్పందిస్తే మాత్రం ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.







