ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చింది ఏపీ ప్రభుత్వం.వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
అయితే టీడీపీ సభ్యులు పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.
ఎన్టీఆర్ కు తనెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.ఎన్టీఆర్ కంటే చంద్రబాబు కంటే ఎక్కువ గౌరవం తనే ఇస్తానని చెప్పారు.
అన్ని ఆలోచించాకే హెల్త్ వర్సిటీ పేరును మార్చామని తెలిపారు.దివంగత నేత డాక్టర్.
వైఎస్ఆర్ అంటే అందరికి సుపరిచితమన్న ఆయన.పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు.
కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ అని జగన్ వెల్లడించారు.
అనంతరం టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేదని సీఎం జగన్ తెలిపారు.
గతంలో వైఎస్ఆర్ రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలను కట్టారన్నారు.ఇప్పుడు మొత్తం 17 కాలేజీలను కడుతున్నామని చెప్పారు.
ఒక్క కాలేజీని కట్టలేని వారు తమకు కావాల్సిన పేరును బలవంతంగా పెట్టుకున్నారని విమర్శించారు.ఇన్ని కాలేజీలు కట్టిన తాము వైఎస్ఆర్ పేరు పెట్టడం కరెక్టేనని సీఎం జగన్ వ్యాఖ్యనించారు.







