లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి పెద్ద తారాగణం నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో హీరో కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమా గురించిఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సినిమా పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సందర్భంగా కార్తీ మాట్లాడుతూ ఈ సినిమాకు ఇతర పిరియాడికల్ సినిమాలకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు.చాలా సినిమాలు ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్ కు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అంతా కూడా సహజసిద్ధంగా తెరకెక్కించారని ఈయన వెల్లడించారు.

ఇక ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ హిస్టారికల్ లైవ్ లొకేషన్ లో చిత్రీకరణ జరపడానికి ప్రయత్నించామంటూ ఈ సందర్భంగా కార్తీక్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.చాలా రోజుల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.







