కార్తికేయ 2 కి మరీ ఇంత బజ్ ఏంటి బాబోయ్‌...!

నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పెద్ద ఎత్తున సినిమా వసూళ్లు సాధించినా కూడా ఇంకా ఈ సినిమాను ఓటిటి ద్వారా చూడాలని కొందరు ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో మంచి బిజినెస్ జరిగినట్లుగా సమాచారం అందుతుంది.జీ 5 సంస్థ వారు ఏ సినిమాను కొనుగోలు చేసి దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున స్ట్రీమింగ్‌ చేసేందుకు గాని ఏర్పాటు చేసినట్లుగా సమాచారం అందుతుంది.

 Nikhil Karthikeya 2 Movie Collections And Ott Streaming Update , Anupama Parames-TeluguStop.com
Telugu Karthikeya, Telugu, Nikhil-Movie

ఒక చిన్న బడ్జెట్ సినిమాను విడుదల చేస్తున్నప్పుడు సాధారణంగానే బజ్ ఉంటుంది.కానీ ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో మాత్రం స్టార్ హీరో సినిమా కు ఏమాత్రం తగ్గకుండా బజ్ క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు.మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమాలు ఎలా అయితే రిలీజ్ కి ముందు స్ట్రీమింగ్‌ కి ముందు ఆసక్తిని రేకెత్తిస్తాయో అలాగే కార్తికేయ 2 సినిమా కూడా మంచి బజ్ ని కలిగి ఉంది.

దాంతో మొదటి రోజు రికార్డు స్థాయి వ్యూస్ ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్రీకృష్ణుడిని నేపథ్యంలో రూపొందిన ఏ సినిమాలు నిఖిల్ నటన చాలా బాగుంది అంటూ ప్రశంసలు దక్కించుకుంది.

చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు సంబంధించి కలెక్షన్స్ రికార్డును సృష్టించాయి అనడంలో సందేహం లేదు.కేవలం ఉత్తర భారతంలో రూ.30 కోట్ల వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంది.ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండా ఆ స్థాయి వసూలు దక్కడం అంటే మామూలు విషయం కాదు.

మలయాళంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube