మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీకున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించగా నయనతార, సత్యదేవ్, సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి ఈ చిత్రం రీమేక్ అనే విషయం తెలిసిందే.మోహన్ లాల్ అద్భుతమైన నటనతో ఆ సినిమాను సూపర్ హిట్ చేశాడు.
గాడ్ ఫాదర్ సినిమాను కూడా మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ చేస్తాడని అంతా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సినిమా విడుదలకు రెండు వారాల సమయం కూడా లేకపోవడంతో పబ్లిసిటీ కార్యక్రమాలు చేయకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో సినిమాను ఏకంగా 205 కోట్ల రూపాయలకు అమ్మేశారంటూ వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.ఏమాత్రం ప్రమోషన్ చేయకుండానే ఈ స్థాయిలో సినిమాను అమ్మేయడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను ఏకంగా రూ.55 కోట్లకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేశారట.ఇక థియేటర్ మరియు ఇతర రైట్స్ ద్వారా భారీగానే ఆదాయం దక్కినట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.ఎంత భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని చిత్ర నిర్మాతలు కూడా ఊహించి ఉండరు.

సినిమాకు చిరంజీవి పారితోషికం కాకుండా పాతిక నుండి 30 కోట్ల మేకింగ్ ఛార్జి అయ్యి ఉంటుందంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.మహా అయితే 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు.ఇది గాడ్ ఫాదర్ విషయంలో ఎలా జరిగిందో అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎందుకంటే ఇది ఒక డబ్బింగ్ సినిమా పైగా సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెద్దగా చేయడం లేదు అయినా కూడా ఈ స్థాయి బిజినెస్ కేవలం మెగాస్టార్ చిరంజీవి వల్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







