మరో టాలీవుడ్ స్టార్‌ ను మెప్పించిన మిల్కీ బ్యూటీ.. నిజమేనా అంటున్న ఫ్యాన్స్‌?

మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలం దాటుతున్న కూడా ఇండస్ట్రీ లో ఇంకా వరుసగా సినిమాలు, సిరీస్ లు అంటూ చేస్తూ బిజీ బిజీ గానే ఉంది.ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న జైలర్‌ అనే సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 Tamanna New Film In Tollywood With Star Hero ,tamanna, Tollywood, Rajanikanth,-TeluguStop.com

మొదట ఆ సినిమా లో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారు.కానీ ఆమె డేట్లు సర్దు బాటు చేయడం లో ఆమె విఫలం అవ్వడం తో ఆ పాత్ర కు మన మిల్కీ బ్యూటీ తమన్నా ను ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

కెరియర్ పూర్తి అయింది.ఇక తమన్నా సర్దేస్కోవడమే అంటూ కొందరు కామెంట్స్ చేశారు, కానీ ఇప్పుడు ఆమె మళ్లీ సూపర్ స్టార్ సినిమా లో నటించేందుకు సిద్ధమవడం తో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

కేవలం సూపర్ స్టార్ రజినీ కాంత్ తో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో ఒక సీనియర్ స్టార్ హీరో సినిమా లు కూడా తాజాగా కమిట్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.చిరంజీవి తో ఒక సినిమా చేస్తూనే మరో సీనియర్ స్టార్ హీరో తో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు, కచ్చితంగా తమన్నా ప్రస్తుత జోరు చూస్తుంటే మరో ఐదు సంవత్సరాల పాటు హీరోయిన్ గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వెండి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bholashanker, Chiranjeevi, Item, Rajinikanth, Tamanna, Tollywood-Movie

ప్రస్తుతం తమన్నా ఐటెం సాంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్ మ్యూజిక్ ఆల్బమ్ వెబ్ సిరీస్ ఇలా వచ్చిన ప్రతి ఒక్క అవకాశం సద్వినియోగం చేసుకుంటూ జనాల్లో ఉంటూ వరుసగా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube