టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వివి వినాయక్.మొదటి సినిమాతోనే దర్శకుడిగా మనిషి గుర్తింపు ఏర్పరచుకున్న వినాయక్ ఆ తర్వాత దిల్,లక్ష్మి, ఠాగూర్, కృష్ణ, బన్నీ, అదుర్స్ ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఇక వివి వినాయక దర్శకత్వం వహించిన ఠాగూర్ సినిమా అయితే అప్పట్లో బాక్సాఫీస్ పెద్ద సంచలనం సృష్టించింది.
ఇది ఇలా ఉంటే వి వి వినాయక్ ఒకవైపు డైరెక్షన్ చేస్తూనే మరొకవైపు నటుడిగా కూడా కొనసాగడానికి సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు.
ఇకపోతే గతంలో వివి వినాయక కొన్ని కొన్ని సినిమాలలో చిన్న చిన్న కథలు నటించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు.
కాగా గతంలో దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఒక కొత్త సినిమాను కూడా మొదలుపెట్టగా దానికి శీనయ్య అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది.కానీ సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత ఎందుకో సరిగ్గా రావడం లేదు అని మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే క్యాన్సిల్ చేసేసారు.
ఇప్పుడు దర్శకుడు వినాయక్ తన సొంతంగా సొంత డైరెక్షన్ లోనే ఒక సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు.

ఇక ఆ సినిమాకు కథ మాటలు ఆకుల శివ అందించబోతున్నారు.ఇంతకుముందు వీరి కలయికలు వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది అందుకే వినాయక్ మళ్లీ చాలా కాలం తర్వాత ఆ రచయితతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.







