మంచు మనోజ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది.ఆ మధ్య అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించి సినిమాని కూడా మొదలు పెట్టడం జరిగింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని ఇండియన్ భాషల్లో కూడా సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.సినిమా ఫస్ట్ లుక్ చూసి అంతా కూడా మంచు మనోజ్ ఏదో భారీ ప్రయోగమే చేయబోతున్నాడు తప్పకుండా విజయాన్ని సాధించేలా ఉన్నాడంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ అనూహ్యంగా సినిమా ప్రారంభం కాకుండానే ఇప్పటి వరకు కనీసం క్లారిటీ ఇవ్వకుండా వదిలేశాడు.
ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కూడా పెళ్లిపై ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.
మరి కొందరు మాత్రం సినిమాలు చేసే ఆలోచన మంచు మనోజ్ కి లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా వరకు సినిమాలు డిజాస్టర్ గా నిలవగా కొన్ని సినిమాలు కాస్త పరవాలేదు అన్నట్లుగా నిలిచాయి.
అయినా కూడా ఆయన సినిమాలంటే ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రెస్ట్ మోజు లేదు అందుకే మంచు మనోజ్ కూడా పడి పడి సినిమాల చేయాలన్నంత హడావిడి చూపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం తన రెండవ పెళ్లికి సంబంధించిన హడావుడి ఉన్నట్లుగా తెలుస్తోంది.

భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్న మంచు మనోజ్ ఆ పెళ్లి తంతు తర్వాత తన సినీ జర్నీ మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ప్రస్తుతానికి అహం బ్రహ్మాస్మి సినిమాను పక్కకు పెట్టాడని దాన్ని పునః ప్రారంభిస్తాడా లేదంటే పూర్తిగా పక్కకు పెట్టినట్లేనా అనేది తెలియాల్సి ఉంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమా మధ్యలో వదిలేయడం అంటే కచ్చితంగా పెద్ద తప్పే అవుతుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అతి త్వరలోనే మంచు మనోజ్ సినిమాకు సంబంధించిన ప్రకటన రావాలంటే మంచు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.







