ఇకపై వారి పాదాలకు నేనే నమస్కరిస్తా.. వినూత్న నిర్ణయం తీసుకున్న లారెన్స్!

రాఘవ లారెన్స్ నటుడిగా, కొరియోగ్రాఫర్ గా,దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు అనేలాగా ఎన్నో భయంకరమైన థ్రిల్లర్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లారెన్స్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

 From Now On I Will Bow Down At Their Feet Lawrence Details, Lawrence ,innovative-TeluguStop.com

తాము కష్టంలో ఉన్నామని ఎవరైనా లారెన్స్ వద్దకు వెళ్తే వారి కష్టాన్ని తన కష్టంగా భావించి వారికి అండగా నిలుస్తారు.

ఇలా ఇప్పటివరకు లారెన్స్ ఎంతో మందికి సహాయ సహకారాలు చేశారు.

ఇకపోతే తాజాగా లారెన్స్ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు.ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తే కృతజ్ఞత భావంగా పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు.

ఇకపై ఎవరు అలా చేయకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈయన తన నిర్ణయాన్ని తెలియజేస్తూ.

నా జీవితంలో ఇది ఒక పెద్ద మార్పు.ఇకపై నేను ఎవరికీ సహాయం చేసిన వాళ్లు నా పాదాలపై పడకూడదని భావిస్తున్నాను.

నేనే వారి పాదాలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ ఒక బాలుడికి పాద సేవ చేస్తున్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.నాలో ఈ చిన్న మార్పు కోసం చాలా కాలం రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను.ఈరోజు నుంచి తొలి అడుగు వేస్తున్నాను ఇప్పటివరకు ధనవంతులు సహాయం చేస్తే వారి కాళ్లకు నమస్కరించడం నేను చూశాను.ఇకపై ఇలాంటి సంఘటనలు తాను చూడకూడదని భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈయన నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube