టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి మనందరికీ తెలిసిందే.హీరోగా అఖిల్ నటించిన ది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు.
అంతేకాకుండా టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిల్.తన తండ్రి అక్కినేని నాగార్జున మాధురి గాని అఖిల్ కి కూడా అమ్మాయిల ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పవచ్చు.
అఖిల్ ఇప్పటివరకు తెలుగులో అఖిల్ హలో,మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించాడు.
ఇక ఇది ఇలా ఉంటే అఖిల్ ను ఇష్టపడే వారిలో కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా ఉన్నారు.
కొంతమంది అమ్మాయిలు అయితే అఖిల్ పై విపరీతంగా క్రష్ ని పెంచుకుంటున్నారు.వారిలో అందాల హాట్ యాంకర్ అయినా విష్ణు ప్రియ భీమినేని కూడా ఒకరు.అఖిల్ కు ఈమె వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.ఇటీవల ఆమె అఖిల్ గురించి మాట్లాడుతూ.
అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలంటుంది విష్ణు ప్రియ.అంతే కాకుండా ఆ ఛాన్స్ కోసం డైరెక్టర్ లను కూడా రిక్వెస్ట్ చేస్తోందట.తనకు అఖిల్ తో జన్మజన్మల అనుబంధం ఉందని.ఆయనంటే ప్రాణమంటోంది ఈ యాంకరమ్మ.

అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ దర్శకులను వేడుకుంటోందట.అంతే కాదండోయ్ అఖిల్ నటించిన సినిమాలు వచ్చినా,ఆయన బర్త్ డే వచ్చినా అఖిల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ప్రేమించేస్తుందట విష్ణు ప్రియ.మరి ఫేమస్ యాంకర్ బాధ చూసైనా దర్శకులు అఖిల్ తో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఇస్తారో లేదో చూడాలి మరి.ఇకపోతే యాంకర్ విష్ణు ప్రియ విషయానికి వస్తే.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే వెండితెరపై కూడా అవకాశాలను అందుకోవాలని చూస్తోంది.ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామర్ ట్రీట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.







