నాకు ఉన్నది అభిమానులు కాదు.. ఆర్మీ: అల్లు అర్జున్ వైరల్ కామెంట్స్!

శ్రీ విష్ణు, కాయాదు లోహర్ జంటగా నటించిన తాజా చిత్రం అల్లూరి.ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు.

 Icon Star Allu Arjun Speech At Alluri Pre Release Event, Allu Arjun, Icon Star,-TeluguStop.com

సెప్టెంబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమాను నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మించారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు.

కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.

నేను ఎప్పుడో అన్నాను నాకు ఉంది అభిమానులు కాదు ఆర్మీ అని.

ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అది నాకు నిజమే అని అనిపిస్తుంది.మీ అల్లరి మాకు ఎంతో జోష్ని నింపుతోందీ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.అనంతరం అల్లూరి సినిమా గురించి మాట్లాడుతూ.ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా తరపున బెస్ట్ విషెస్ చెబుతున్నాను.అలాగే నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారి అన్ని సినిమాలు చూశాను.

ఈ అల్లూరి సినిమా కూడా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అని తెలిపాడు అల్లు అర్జున్.సెప్టెంబర్ 23న విడుదల అయ్యే అల్లూరి సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

Telugu Allu Arjun, Alluri Pre, Icon, Tollywood-Movie

అనంతరం శ్రీ విష్ణు గురించి మాట్లాడుతూ నాకు తన మొదటి సినిమా గురించి తెగ నచ్చేసాడు.శ్రీ విష్ణు నటించిన సినిమాలు అన్నీ కూడా చూశాను.అన్ని బాగున్నాయి అని తెలిపాడు అల్లు అర్జున్.అలాగే ప్రస్తుతం సినిమాల పరిస్థితి గురించి కూడా చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి.అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు.

మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అన్నది చూడడం లేదు.

కాబట్టి ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు కంటెంట్ ఉన్న సినిమాను పేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని తెలిపాడు అల్లు అర్జున్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube