యాదాద్రి జిల్లా:ఆర్టీసీలో పనిచేసే కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికొదిలేసారని ఆర్టీసీ మునుగోడు నియోజకవర్గ జెఎసి కన్వీనర్ కె.రాజిరెడ్డి ఆరోపించారు.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జెసి గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు,రవాణా సంస్థలో పని చేసే 47 వేల మంది ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 2017 ఏప్రిల్ 1,2021 ఏప్రిల్ 1 రావలసిన రెండు వేతనాలు ఇవ్వాలని, జనవరి 2020 నుండి రావలసిన 6 డిఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు.2013 వేతన సవరణకు సంబంధించిన యాభై శాతం ఏరియర్స్ కు సంబంధించి ఇచ్చిన బాండ్స్ కాలపరిమితి 5 సంవత్సరాలు పూర్తి అయినందున బాండ్ల డబ్బులు చెల్లించాలన్నారు.ఆర్టీసీలో సంక్షేమ మండళ్ళను రద్దుచేసి ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని,యూనియన్ కార్యకలాపాలు అనుమతించాలని కోరారు.2019 డిసెంబర్ 1 న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో టిక్కెట్ తీసుకునే భాద్యత ప్రయాణికుడిదేనని అమలు చేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోని,ఆర్టీసీ ఉద్యోగస్తులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.సకల జనుల సమ్మెలో పాల్గొని రిటైరైన కార్మికులకు సమ్మే వేతనం చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు సుర్కంటి మోహన్ రెడ్డి,ఎంవీ.చారి,కత్తుల యాదయ్య,అధిక సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.