తిరుమలలో అన్నదానం పేరు చెప్పే ప్రైవేట్ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని టీటీడీ తెలిపింది.అక్రమ విరాళాలు సేకరించే ట్రస్టులపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఈనెల 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నామన్నారు.
అదేవిధంగా తిరుమల కొండ నుంచి ఇతర ప్రాంతాలకు టీటీడీ విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతోందని వెల్లడించారు.ఇప్పటికే అలిపిరికి చేరుకున్న ఈ బస్సులను బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారని స్పష్టం చేశారు.







