రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా.
అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి దగ్గర 268.400 గ్రాముల గోల్డ్‌ను సీజ్ చేశారు.పట్టుకున్న బంగారం విలువ రూ.13.73 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







