ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరమర్శించడానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ పర్యటనలో అనుక్షణం రాజ్‌నాథ్ వెంట ప్రభాస్ ఉండడంపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్ఛ జరుగుతుంది.
బాహుబలి స్టార్ ప్రభాస్ రాజ్‌నాథ్ పక్కనే ఉండేలా బీజేపీ జాగ్రత్తలు తీసుకుందట.కృష్ణంరాజు సంతాప సభకు ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లారు.
రాజ్ నాథ్ తనతో పాటు ప్రభాస్ సభకు వచ్చేలా చూశారు.
రాజ్‌నాథ్ హైదరాబాద్ పర్యటనలో లోతైన రాజకీయ లెక్కలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుపై ఉన్న ప్రేమతో కాకుండా ప్రభాస్‌కు ఉన్న రాజకీయ ప్రాధాన్యతతో దృష్ట్యా ఈ పర్యటన సాగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.2024 ఎన్నికల్లో ప్రభాస్ ఫిల్మీ చరిష్మాను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ముఖ్యంగా బాహుబలి తర్వాత పాన్-ఇండియా స్టార్ మారిన ప్రభాస్‌ను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది.

కర్నాటక, ఉత్తర భారతదేశంలో అతని చరిష్మాతో ఓట్లు సాధించాని ప్రయత్నిస్తుంది.కోస్తా ఆంధ్రా జిల్లాతో పాటు హైదరాబాద్‌లో, ముఖ్యంగా కొంపల్లి, కూకట్‌పల్లిలో క్షత్రియ ఓట్లను బీజేపీ గెలవడానికి ప్రభాస్ సహాయపడతారని కూడా వర్గాలు చెబుతున్నాయి.
కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించిన ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ పశ్చిమగోదావరి జిల్లా నరసపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.
సోదరుడు పోటీలో ఉంటే, ప్రభాస్ బీజేపీకి ప్రచారం చేయడం ఖాయం అని వర్గాలు చెబుతున్నాయి.దీంతో రాజ్‌నాథ్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.







