ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాంసాహారాన్ని చాలా ఎక్కువ మంది ప్రజలు ఇష్టంగా తింటారు.మనదేశంలో కూడా చాలామంది మాంసాహార ప్రియులు ఉన్నారు.
భారతదేశం ఎప్పుడు అహింసను కోరుకుంటుంది.భారత దేశమే ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి అహింసాహిత దేశం.
పులి మేకను తింటుంది కాబట్టి దాన్ని క్రూర మృగం అని అంటారు.ఆవు గడ్డిని మేస్తుంది కాబట్టి అది సాధు జంతువు.
లక్షల సంవత్సరాల నుంచి భారతీయులు అహింసా విధానాన్నే అనుసరిస్తున్నారు.
మాంసాహారం తినడం వల్ల సకల రోగాలు వస్తాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ’ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు మహాకారుణ ధ్యాన శాఖాహార ప్రచారం చేస్తున్నారు.గురువారం ఈ కార్యక్రమం వేములవాడ పట్టణానికి చేరుకొని ప్రధాన కూడళ్ళు, బస్టాండ్ ప్రాంతాలలో తిరుగుతూ శాఖాహారం పట్ల అవగాహన కల్పించారు.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సీనియర్ సభ్యుడైన పిరమిడ్ మస్టర్ అనిల్ కుమార్ చింతా గారు మాట్లాడుతూ.మాంసాహారం సర్వరోగలకు కారణమని చెప్పారు.
మాంసం అనేది రాక్షసుల ఆహారమని, మానవుల ఆహారం కాదని వెల్లడించారు.

శాకాహారం తినడం ద్వారానే మనిషి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.గొప్ప మేధావులు, మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సీవీ రామన్, డాక్టర్ అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ వంటి వారందరూ శాకాహారులే.
పత్రీజీ స్వామి మాట్లాడుతూ మేము దేశ విదేశాల్లో చాలామందిని శాఖాహారులుగా మార్చి వారు ఆరోగ్యంగా, మనశ్శాంతితో ఆనందంగా జీవించేలా చేస్తున్నామని చెప్పారు.అలాగే ఆయన మాట్లాడుతూ ఈ భూమి మీద ప్రతి జీవి ప్రాణం సమానమేనని చెప్పారు.
ఒక గొర్రె ప్రాణం విలువ మనిషి ప్రాణం కన్నా తక్కువ కాదు అని, మనిషి తన ఆకలి కోసం ఒక ప్రాణిని చంపడం నేను అస్సలు అంగీకరించారని చెప్పారు.







