అలాంటి విషయాలపైనే దృష్టి పెట్టండి.. అలియా కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Focus On Such Things Alias Comments Are Viral Alia ,rrr ,directed By Rajamouli,-TeluguStop.com

ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగులో ఈమె కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఈమె నటుడు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలైన విషయం మనకు తెలిసిందే.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.చాలాకాలం తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి హిట్ అయిన సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది.

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం అయినప్పటికీ ఈ సినిమాలో అలియా భట్ పాత్ర గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.తన పాత్ర నిడివి తక్కువగా ఉందంటూ ఈమె పై ఎంతోమంది ట్రోల్స్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ ట్రోల్స్ పై రిపోర్టర్స్ ఆమెను ప్రశ్నించారు.

Telugu Alia, Ayan Mukerji, Brahmastra, Rajamouli, Ranbir Kapoor-Movie

ఈ ప్రశ్నకు అలియా భట్ సమాధానం చెబుతూ.బ్రహ్మాస్త్ర సినిమా మంచి విజయం అయినప్పటికీ కొందరు తన పాత్ర పై ట్రోల్స్ చేస్తున్నారు.అయితే నా గురించి ఇలా ట్రోల్స్ చేసే వాటి గురించి నేను ఏమాత్రం పట్టించుకోను.

సినిమా మంచి హిట్ అందుకున్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు అయితే సినిమాని కేవలం పాజిటివ్ ఒపీనియన్ తో చూసి, అలాంటి పాజిటివ్ విషయాలను పరిగణలోకి తీసుకొని వాటిపై దృష్టి పెట్టాలి అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు.బ్రహ్మాస్త్ర పార్ట్ 1లో ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ పార్ట్ 2 లో మాత్రం ఈమె పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube