గుడ్ న్యూస్ చెప్పిన దేవత సీరియల్ నటి.. తల్లి కాబోతున్న విషయం చెప్పిన వైష్ణవి!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి వైష్ణవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది వైష్ణవి.

 Devatha Serial Actress Vaishnavi Announce She Pregnant Now , Serial Actress , Va-TeluguStop.com

స్టార్ మా లో ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది వైష్ణవి.ఇకపోతే ఇటివలే వైష్ణవి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక వైష్ణవి భర్త మరి ఎవరో కాదు స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ డైరెక్టర్.కాగా ఇటివలె మూడుముళ్ల బంధంతో ఒకటై వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే.

అయితే పెళ్లికి ముందు నుంచే సొంత యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను పంచుకుంది.

నిశ్చితార్థం నుంచి షాపింగ్ పెళ్లి వరకు కూడా ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంది.అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంది వైష్ణవి.

ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత కొద్ది రోజుల పాటు కొత్త కొత్త వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసిన వైష్ణవి కొద్దిరోజుల పాటు గ్యాప్ తీసుకుంది.అయితే గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పుకొచ్చింది.

రజక వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త వీడియోని విడుదల చేసింది.

ఆ వీడియోలో తాను తల్లి కాబోతున్నాను అంటూ శుభవార్తను చెప్పింది వైష్ణవి.అయితే కొద్ది రోజులపాటు యూట్యూబ్ ఛానల్ లో ఎటువంటి వీడియోలు పంచుకొని వైష్ణవి ఇలా ఒక్కసారి గా తల్లి కాబోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు కూడా సంతోషపడి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.గ్యాప్ ఎందుకు వచ్చిందో అసలు విషయం చెప్పేస్తున్నాను.

మా ఇంట్లో ఇప్పటి వరకు నేను మా ఆయన మాత్రమే ఉన్నాము ఇప్పుడు మా ఇంట్లోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు.నేను తల్లిని కాబోతున్నాను అంటూ శుభవార్తను సంతోషంగా పంచుకుంది వైష్ణవి.

తాను ప్రెగ్నెంట్ అన్న విషయం ఏంటో తెలిసి ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని తెలిపింది వైష్ణవి.ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతిని అని చెప్పుకొచ్చింది.

అలాగే ఇప్పటివరకు నన్ను దీవించారు.ఇకపై కూడా నాతోపాటు నా బేబీని కూడా దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది వైష్ణవి.

ఈ వీడియోని చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube