దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించిన ఈయన తాజాగా సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆగస్టు 5వ తేదీ విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఒక అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
దుల్కర్ మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగులో ఒక్క సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా వరుస సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే సీతారామం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాలో ఈయనని ఏకంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో పోల్చారు.ఇలా షారుఖ్ ఖాన్ తో ఈయనని పోల్చడం పై దుల్కర్ స్పందించారు.

సీతారామం సినిమాలో తన నటన చూసి తనని షారుఖ్ ఖాన్ తో పోల్చడం సరికాదు.ఇలా ఆయనతో నన్ను పోలిస్తే షారుక్ ఖాన్ ను అవమానించినట్లేనని ఈయన వెల్లడించారు.షారుక్ ఖాన్ తన అభిమాన హీరో అని చిన్నప్పటినుంచి తనని చూస్తూ పెరిగానని ఆయనే తన సినిమాలకు స్ఫూర్తి.అలాంటిహీరో ఎప్పుడు తనకు స్ఫూర్తిగానే ఉండాలని అలాంటి వ్యక్తితో తనని పోల్చడం సరికాదంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ గురించి దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







