సాధారణంగా కొందరు ఇతరుల మెప్పు కోసం ఏదో ఒక క్రేజీ పని చేస్తుంటారు.ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా పాపులర్ కావడం చాలా ఈజీ అయింది.
దాంతో ప్రపంచం నలుమూలలా ఉన్న ఎందరో ప్రజలు ఇలాంటి క్రేజీ పనులను చేయడానికి మరింత మంది ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక యువతి ఏకంగా స్కై డైవింగ్ చేస్తూ ఫుడ్ తిన్నది.
దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన చేతిలో ఒక ప్లేట్ పట్టుకుంది.
అందులో పై అనే ఒక కాల్చిన వంటకం ఉంది.ఆమె ఆ వంటకాన్ని ఎంచక్కా తింటూ ఎంజాయ్ చేసింది.
ఈ సమయంలో కొంత వరకు ఫుడ్ కింద పడిపోయింది.స్కై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా వేగంగా ఈదురుగాలులు తగులుతాయి.
అయినా కూడా ఆ ప్లేట్ మాత్రం కింద పడలేదు.దాంతో గాల్లో ఎగురుతూనే ఆమె ఫుడ్ తినడం సాధ్యమయ్యింది.
ఈ వీడియోని మరొకరు రికార్డ్ చేశారు.అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారడంతో నెటిజన్ల దీన్ని చూసి అవాక్కవుతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.“ఏవమ్మా, నీకు తినడానికి ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా? ఇదేం ప్రయోగం తల్లీ” అని కొందరు ఫన్నీగా ఆమెను ఎత్తి పొడుస్తున్నారు.“ఎవరైనా కింద నడుచుకుంటూ వెళ్తుంటే ఈమె ఫుడ్ వారి నడినెత్తి మీద పడే అవకాశం ఉంది.ఏదేమైనా స్కై డైవింగ్‌యే ఈమె జీవితం అనుకుంటా.
అందుకే స్కై డైవింగ్ చేస్తూనే తింటోంది, అరిగించుకుంటోంది” అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు.వ్యూస్ కోసం ఫుడ్ అంతా ఈమె వేస్ట్ చేస్తోందని ఇంకొందరు తిడుతున్నారు.
ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.







