ప్రజాశాంతి పార్టీ రద్దయిందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు.ఇటీవల పలు పార్టీల గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ కూడా రద్దయిందనే ప్రచారం జరుగుతోంది.
అయితే, తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
వాటికి త్వరలోనే సమాధానం పంపిస్తామన్నారు.క్రైస్తవుల్లో ఐకమత్యం లోపించదని.
అందుకే ఇతర పార్టీల నేతల వద్ద దేహీ అంటున్నారని ఆరోపణలు చేశారు.అనంతరం ప్రజా గాయకుడు గద్దర్ ను శాంతిదూతగా అన్ని దేశాలకు తిప్పుతానని చెప్పారు.
అదేవిధంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.







