బీజేపీపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీని చంపింది ఎవరని ప్రశ్నించారు.
గాంధీ హత్య వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానం ఉందని ఆరోపించారు.సాయుధ పోరాటంలో కానీ, స్వాతంత్ర్య ఉద్యమంలో కానీ బీజేపీ పాల్గొనలేదన్నారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని విమర్శించారు.







