నేటి ఆధునిక కాలంలో ప్రతి మనిషి ఏదో ఒక కారణం చేత తరచూ ఒత్తిడికి లోనవుతూనే ఉంటాడు.అయితే చాలా మంది ఒత్తిడిని అసలు ఒక సమస్యగానే భావించరు.
కానీ ఒత్తిడి ఎంతో ప్రమాదకరమైనది.నిలువెత్తు మనిషిని చిత్తు చేసే సత్తా ఒత్తిడికి ఉంది.
శారీరకంగానే కాదు మానసికంగానూ ఒత్తిడి వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అసలు ఒత్తిడికి గురైనప్పుడు ఏ పని పైనా శ్రద్ధ వహించ లేరు.
మెదడు కూడా సక్రమంగా పనిచేయదు.
అందుకే ఒత్తిడిని అంత తక్కువ అంచనా వేయకూడదని అంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను డైట్ లో చేర్చుకుంటే ఎలాంటి ఒత్తిడి అయినా పరార్ అవడమే కాదు మెదడు జెట్ స్పీడ్ వేగంతో పని చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి మరియు ఎప్పుడు దాన్ని తీసుకోవాలి వంటి విషయాలపై ఓ లుక్కేయండి.
ముందుగా రెండు టమాటోలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే మూడు శుభ్రమైన ఉసిరికాయలను తీసుకుని గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
చివరిగా రెండు ఆరెంజ్ లను తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై ఆరెంజ్ జ్యూస్ ను కూడా అందులో వేసి ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయం తో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో చిటికెడు ఉప్పు కలిపి రోజులో ఏదో ఒక సమయంలో సేవించాలి.ఈ ఉసిరి టమాటో ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ముఖ్యంగా ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను తరిమికొట్టి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.రోజు ఈ జ్యూస్ ను తీసుకుంటే మెదడు మునుపటి కంటే వేగంగా పనిచేస్తుంది.
జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెండూ రెట్టింపు అవుతాయి.పైగా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ సైతం బలపడుతుంది.
తద్వారా వివిధ రకాల జబ్బులు దరిచేరకుండా అడ్డుకోవచ్చు.