మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది.దీనిలో భాగంగానే మునుగోడు పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని నియమించింది.
ఈ మేరకు తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, మధుయాష్కి స్థానంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి నియామకం అయ్యారు.
మునుగోడు ప్రచారానికి తనను దూరంగా ఉంచాలని మధుయాష్కి కోరినట్లు సమాచారం.ఈ క్రమంలో ఆ బాధ్యతను దామోదర్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నియోజకవర్గంలో మండల ఇంఛార్జ్ లను అధిష్టానం నియమించగా.పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.







