ఉక్రెయిన్‎లో మృతదేహాల కుప్పలు

ఉక్రెయిన్‎లో రష్యా సృష్టించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.రెండో అతి పెద్ద ప్రాంతమైన ఖర్కివ్ ను కీవ్ సేనలు ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

 Piles Of Dead Bodies In Ukraine-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలను అధికారులు గుర్తించారు.ఒక గొయ్యిలో సుమారు 440కి పైగా మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిలో కొందరు తుపాకీ గాయలతో చనిపోగా.మరికొందరు వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు.అయితే, ఖర్కివ్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడిని తీవ్రతరం చేయడంతో రష్యా దళాలు వెనక్కి వెళ్లాయి.

దీంతో ఈ ప్రాంతాన్ని కీవ్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube