బాలీవుడ్ స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRRసినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
అలాగే హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలియా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రేమలో పడ్డారు.
ఇలా కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వీరి వివాహం జరిగిన రెండు నెలలకే అలియా భట్ తల్లి కాబోతున్నారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈమె కామెంట్ అయినా సినిమాలో షూటింగ్లలో పాల్గొంటూ త్వరగా సినిమా షూటింగ్లను పూర్తి చేశారు.అదేవిధంగా రణబీర్ కపూర్ అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ విధంగా బేబీ బంప్ తోనే అలియా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సందడి చేశారు.మొత్తానికి ఈ సినిమా హిట్ కావడంతో ఈ జంట సక్సెస్ సెలబ్రేషన్ లో ఉన్నారు.ఇకపోతే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో త్వరలోనే ఈమెకు సీమంతం చేయాలని కపూర్ ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం.ఇక ఈమె శ్రీమంతం సెప్టెంబర్ చివరి వారంలో ఉండబోతుందని బీ టౌన్ సమాచారం.
ఇకఈ సీమంతానికి పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నట్టు తెలుస్తుంది.అలియా భట్ సైతం బేబీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







